39.2 C
Hyderabad
April 25, 2024 16: 43 PM
Slider పశ్చిమగోదావరి

హరిజన వాడ స్కూలుపై సర్కారు నిర్లక్ష్యం

#Harijan Wada School

ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు పడమర హరిజన వాడ ప్రాథమిక ఎలిమెంటరీ పాఠశాల అభివృద్ధికి దూరమైంది. 20 ఏళ్లనాడు ఎలా ఉందో నేడు కూడా అలాగే ఉంది. విద్యార్థులకు బెంచీలు లేక నెలపైనే కూర్చుని విద్యనేర్చుకుంటున్నారు. పాఠశాలలో టాయిలెట్ లు లేవు. త్రాగునీరు లేదు. ఈ పాఠశాలలో 1నుండి 5వ తరగతి వరకు సుమారు 60 మందికి పైగా విద్యార్థులున్నారు. గతంలో ఈ పాట శాల ఆర్ సి ఎం సంస్థలో నడిచేది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలగా విలీనం చేసిందని ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు తెలిపారు. పిల్లలకు ఆటస్థలం కూడా లేదన్నారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కనీస సదుపాయాలు కూడా లేకపోవడం బాధాకరమని ఉపాధ్యాయులు వాపోతున్నారు. నాడు నేడు క్రింద ఎన్నో పాఠశాలలు అభివృద్ధి చేసిన ప్రభుత్వం దళిత వాడాలో ఉన్న ఈ పాఠశాలను కూడా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఈ పాఠశాలలో చదివే పిల్లలందరూ దళిత కుటుంబాల కు చెందిన వారవడం విశేషం. ఈ పాఠశాలలో పాఠాలు బోధించే ఉపాధ్యాయురాలికి సరైన కుర్చీ లేదు. టేబుల్ బల్ల కూడా లేక విద్యార్థులకు కుర్చీనుండి నెలకు వంగి పాఠాలు పాఠాలు బోధిస్తున్న పరిస్థితి బాధాకరం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని పాఠశాల ఉపాధ్యాయుడు కోరుతున్నారు.

Related posts

Gujarat Election: తాడో పేడో తేల్చేది గిరిజన ఓటర్లే

Satyam NEWS

ఈ నెల 26న కేంద్ర‌మంత్రి మ‌న్సుఖ్ విజయనగరం జిల్లా ప‌ర్య‌ట‌న‌

Satyam NEWS

శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాలకు కేసీఆర్ కు ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment