28.7 C
Hyderabad
April 25, 2024 06: 54 AM
Slider శ్రీకాకుళం

ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగస్తుల ప్రాణాలకు విలువ లేదా?

#Balakasi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగస్తుల ప్రాణాలకు విలువ లేదా అని సంఘ నాయకులు ప్రశ్నించారు. ఇప్పటి  వరకు రాష్ట్ర ప్రభుత్వం, సమగ్ర శిక్షా లో  100  పైగా ఉద్యోగస్తులు మరణించినా  కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించవలసిన ఎక్స్గ్రేషియా చెల్లించడం లేదు. 

సహజంగా ఒప్పంద, పొరుగు సేవ లో పనిచేస్తున్న  ఉద్యోగస్తులు ఆకస్మికంగా మరణించినట్లయితే అతనికి కుటుంబానికి 2 లక్షలు పైగా చెల్లించాలి. అదేవిధంగా  ఒప్పంద, పొరుగు సేవల  ఉద్యోగస్తుడు ప్రమాదవశాత్తు  మరణించినట్లయితే 5 లక్షల రూపాయలు  కుటుంబానికి అందజేయాలి.

కానీ జి.ఓ. నెంబర్ 25, ప్రకారం తేదీ 18-02-2019  ఉత్తర లోనూ  వెంటనే అమలు చేయాలని, అలాగే సమగ్ర శిక్ష  ప్రాజెక్టులో పనిచేస్తు మరణించిన ఆ ఉద్యోగస్తుడు   కుటుంబం లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష  ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగస్తుల  అధ్యక్షుడు ఎం.బాల కాశి, ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts

గడప గడపకు కాంగ్రెస్

Bhavani

తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలి

Satyam NEWS

కొల్లాపూర్ చరిత్రకు తూట్లు పొడుస్తున్న స్వార్థపరుల ప్లాట్లు

Satyam NEWS

Leave a Comment