సమ్మెలో ఉన్న 49 వేల మంది ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేసే దిశగా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోబోతున్నది. లేబర్ యాక్టు ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగితే, కార్మికులు సమ్మె చేసిన రోజులతో పాటు అదనంగా మరో 8 రోజుల జీతం కట్ చేసే వెసులుబాటు ఆర్టీసి యాజమాన్యానికి ఉంటుందని ఉన్నతాధికారులు అంటున్నారు. సమ్మె చేస్తున్న కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంచేసింది. సమ్మె కాలంలో కార్మికుల పట్ల యాజమాన్యాలు కఠినంగా వ్యవహరించిన గత ఉదంతాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిష్కారాలు ఇవి1. ప్రైవేటుపరం చేయడాన్ని కార్మికులు ప్రశ్నించకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించడం. ప్రభుత్వంలో విలీనం చేస్తూనే, దశలవారీగా ఆర్టీసీ ప్రైవేటీకరణ. తద్వారా ఆర్టీసీకి నిర్వహణా భారాన్ని తగ్గించి నష్టాల నుంచి గట్టెక్కించడం. 2. ప్రస్తుతం ఉన్న టీఎస్ ఆర్టీసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడం. తద్వారా కార్మిక సంఘాల హవా తగ్గించడం. ఆర్టీసీని నష్టాల ఊబిలోంచి బయటపడేయటం. భాగ్యనగర్ రోడ్డు రవాణా సంస్థను జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహించడం
previous post
next post