చేపల పెంపకంతోనే మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని రాష్ట్ర జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి అన్నారు. బుధవారం ఫిషరీస్ డాక్టర్ శాంతి అధ్యక్షతన గండికోట డ్యాంలో చేప పిల్లలను విడుదల చేశారు. తొలుత గంగమ్మ తల్లికి ఎమేల్యే ఆదినారాయణ రెడ్డి పూజలు చేసి చేప పిల్లలను విడుదల చేశారు. చేప పిల్లలు ఎంత ఉత్పత్తి జరిగితే అంతమేర మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని, తద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు.
కుల వృత్తిదారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆదినారాయణ రెడ్డి అన్నారు. సీఎం కృషి వల్ల చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపట్టామని చెప్పారు. 450000 చేప పిల్లలు ను వదిలిపెట్టినప్రాంతంలోట్లు ఫిషరీస్ ఆధికారులు తెలిపారు. చేపల వేటకు వెళ్లేవారు ప్రతి ఒక్కరూ బీమా సౌకర్యం కల్పించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.