31.2 C
Hyderabad
June 20, 2024 22: 08 PM
Slider ఆదిలాబాద్

సోషల్ మీడియాలో ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయాలి

#balkasuman

సీఎం కేసీఆర్ గెలుపు కోసం పదేళ్ళలో ప్రభుత్వం చేపట్టిన పథకాలను బీఆర్ఎస్ విద్యార్థి యువత సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ యువతకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాలులో నిర్వహించిన విద్యార్థి యువజన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో అయినా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. నాడు ఉద్యమంలో కాంగ్రెస్, బీజేపీ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.

కేసీఆర్ దీక్షతో ఢిల్లీ పార్లమెంట్ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఎక్కడి వాళ్ళని ప్రశ్నించిన సుమన్ నాడు వాళ్ళు ఉద్యమం కోసం పోలీసు దెబ్బలు తిన్న రోజు ఉన్నారా అని నిలదీశారు. నాడు చంద్రబాబు చెప్పులు మోసిన ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. నవంబర్ 30 వరకు మొబైల్ ఫోనే మనకు ఆయుధమన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల కళ్ళు తెరిచేలా ప్రచారం చేయాలని సూచించారు. నాడు ఉద్యమంలో ముందంజలో ఉన్నది విద్యార్థి యువకులేనని, నేడు ఎన్నికల్లో కూడా విద్యార్థుల పాత్ర ఉండాలన్నారు. భారీ మెజారిటీతో కేసీఆర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ లో నూతన సంవత్సర వేడుకలు

Satyam NEWS

మనీష్ సిసోడియా రిమాండ్ మరో 5 రోజులు పొడిగింపు

Satyam NEWS

ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల ట్రాన్స్ఫర్

Bhavani

Leave a Comment