33.2 C
Hyderabad
April 26, 2024 02: 27 AM
Slider ఖమ్మం

అర్హులైన పేదలకు  ప్రభుత్వ పథకాలు అందాలి

#legal cell

ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారికీ సకాలంలో వాటి లబ్ది చేకూరాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.తెలిపారు.  జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లాలోని  శ్రీరాంపురం గ్రామం, పెనగడపలో  న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న  న్యాయమూర్తి జి. భానుమతి మాట్లాడుతూ   నల్సా, న్యూఢిల్లీ వారు  ప్రవేశపెట్టిన వెనుకబడిన జిల్లాలలో భాగంగా పేదలకు ప్రభుత్వ పథకాలు, కనీస మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యా,వైద్యం తదితర అంశాలు  పురోగతిని తెలుసుకోవడంతో పాటుగా అమలుకానిపక్షంలో  సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి  లబ్ధి చేకూరేలా   చర్యలు తీసుకుంటామని తెలిపారు. న్యాయపరమైన సమస్యల కోసం ఉచితముగా కేసును పరిష్కరించడం కోసం  లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో ఏర్పాటు చేయడం జరిగినది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో చీప్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి. పురుషోత్తమరావు,  డిప్యూటీ కౌన్సిల్ పి.నిరంజన్ రావు,  అసిస్టెంట్స్ కౌన్సిల్ జ్యోతి విశ్వకర్మ,నాగ స్రవంతి,  చుంచుపల్లి తహసిల్దార్   కృష్ణ ప్రసాద్, సర్పంచ్ వెంకటమ్మ,  టూ టౌన్ ఎస్సై జువేద,  ఎంపిటిసి నాగమణి, పార లీగల్ వాలంటీర్ రాజమణి, కానిస్టేబుల్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

17 నుంచి 26వ తేదీ వరకు తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

కుల పిచ్చికి బదిలీ శిక్ష: దిమ్మ తిరిగిన అమ్మిరెడ్డి

Satyam NEWS

పిల్ల‌ల‌ను ప‌నుల్లోకి పెడితే క‌న్న‌వాళ్ల‌పై కేసు నమోదు

Satyam NEWS

Leave a Comment