27.7 C
Hyderabad
April 26, 2024 04: 13 AM
Slider హైదరాబాద్

తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య డైరీ ఆవిష్కరణ

#ministersrinivasagowd

తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య-2022 డైరీ, క్యాలెండర్  ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని బేగంపేట లోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ సమయంలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు అందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కేసీఆర్ కావడంతో ఉద్యోగుల జీతాలు దేశంలో ఎక్కడా లేని విధంగా పెంచుకోవడం జరిగింది. 30 % ఫిట్మెంట్, 30% PRC కూడా ఇవ్వడం జరిగింది.  బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా కూడా ఇంత జీతాలు ఇవ్వడం లేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత  కార్పొరేషన్ లో పని చేస్తున్న ఉద్యోగులకు అండగా నిలిచి మొట్ట మొదట తెలంగాణ టూరిజం కార్పొరేషన్ లో PRC పెంచడం జరిగిందని అన్నారు.  సీఎం కేసీఆర్ నాయకత్వంలో.. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ల ఆధ్వర్యంలో..తెలంగాణ ను ఒక టూరిజం హబ్ లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  బంగారు తెలంగాణ కు బాటలు వేస్తూ.. అన్ని రంగాలకు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, రైతులను ఆదుకునేందుకు రైతును రాజు ను చేసేందుకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు అందరినీ ఒక్క తాటి మీదికి తీసుకొచ్చి కార్యక్రమం నిర్వహించడం చాలా శుభ పరిణామం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందింస్తున్న అన్నారు.

ఈ కార్యక్రమంలో.. కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు A. వెంకటేశ్వర్ రెడ్డి, K.రామకృష్ణా రెడ్డి, లోక భూమా రెడ్డి, పి. జగన్ మోహన్ రావు, గజ్జెల నగేష్, డి.బాలరాజ్ యాదవ్, నాగేందర్ గౌడ్, గంగా రెడ్డి, సాయి చంద్, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ రాజేశం,పబ్లిక్ సెక్టార్ ఫెడరేషన్ అధ్యక్షుడు M. గోపి కృష్ణ, ఆర్.శ్రీనివాసులు, యూనియన్ నాయకులు నర్సింహారావు, పి.శ్రీకాంత్, సత్యనారాయణ, ఆనంద్, జీవన్ స్థానిక  ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సరికొత్త చిత్రాలతో దూసుకుపోతున్న లక్ష్మీ భూపాల

Satyam NEWS

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?

Satyam NEWS

మెడికల్ విద్యార్థిని మృతి పై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయవిచరణ జరిపించాలి

Murali Krishna

Leave a Comment