క్రీడాకారుల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్‌ను ఖోఖో ప్రపంచ కప్ విజేత పి.శివారెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ క్రీడాకారుడిని అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో తొలిప్రపంచకప్‌లో ఇండియా విజేతగా నిలవడం సంతోషించదగ్గ విషయమని, ఇండియా జట్టులో ప్రకాశం జిల్లాకు చెందిన శివారెడ్డి ప్రాతినిధ్యం వహించడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు.
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, శాప్ నుంచి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని శాప్ ఛైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు, అద్దంకి మాజీ ఎమ్మె చెంచు గరటయ్య, ఏపీ ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి ఎమ్.సీతారామ్‌రెడ్డి, శేషునాధరెడ్డి, కాశీవిశ్వనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ దినేష్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం వారిరువురూ తమ డిపార్టుమెంటుల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.