39.2 C
Hyderabad
April 23, 2024 17: 36 PM
Slider వరంగల్

కరోనా కట్టడి చేయలేదు కానీ పన్నులు కట్టాలా?

#Bandi Sudhakar Gowd

ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు గాని వారు కట్టే పన్నులపై మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకై ఎంత ఖర్చు చేశారో ఎన్ని విరాళాలు వచ్చాయో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణ లో విఫలమయ్యాయి కాబట్టి ప్రజలే స్వీయ నియంత్రణ పాటించి జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. రోజురోజుకి కరోనా బాధితులు పెరుగుతుంటే ఏ విధంగా నియంత్రించాలి అని ఆలోచించకుండా కేసులు తక్కువ ఉన్నపుడు లాక్ డౌన్ అమలు చేసి కేసులు పెరుగుతుంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని ఆయన అన్నారు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

Satyam NEWS

అకాల వర్ష బాధిత రైతులను ఇప్పటికైనా ఆదుకోవాలి

Satyam NEWS

లేటు వయసులో కమలంపై ప్రేమ ఎందుకు నాయనా?

Satyam NEWS

Leave a Comment