40.2 C
Hyderabad
April 19, 2024 16: 49 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అభివృద్ధికి అధిక నిధులు

poling center

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్‌, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం తరపున సంబంధిత పంచాయితీలకు ఇచ్చే బహుమతి మొత్తాన్ని పెంచారు. గతంలో 15వేల జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.7 లక్షలు, 15 వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన వాటికి రూ.20 లక్షలు నజరానా ఇచ్చేవారు. తాజాగా ప్రభుత్వం వాటిని సవరించింది.

2 వేల జనాభాకంటే తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.5 లక్షలు, 2-5 వేల లోపు జనాభా ఉంటే రూ.10 లక్షలు, 5-10 వేల లోపు ఉంటే రూ.15 లక్షలు, 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకిచ్చే ఈ నజరానాతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు.

Related posts

ఆర్థికంగా చితికినా అసమాన ప్రతిభ చూపిన వైష్ణవి దేవి

Bhavani

వ్యాక్సిన్ అపోహలపై పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్

Satyam NEWS

గన్ షో:భార్య కాపురానికి రావట్లేదని తుపాకీతో కాల్చి

Satyam NEWS

Leave a Comment