39.2 C
Hyderabad
March 29, 2024 13: 59 PM
Slider వరంగల్

గీత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో 5 వేల కోట్లు కేటాయించాలి

#gowdsmeeting

గీత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో 5 వేల కోట్లు కేటాయించాలని కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్ డిమాండ్ చేశారు. కల్లు గీత కార్మికులకు వెంటనే ద్విచక్రవాహనాలు ఇవ్వాలని, గౌడ బందు ప్రకటించి ప్రతి గీత కార్మికునికి పది లక్షల సహాయం అందించాలని ఆయన కోరారు. ములుగు బోర్డయి ఆవరణలో గీత కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రవిగౌడ్ ముఖ్య అతీతంగా హాజరై మాట్లాడుతూ వృధ్యాప్య పింఛన్ 2 వేల నుండి ఐదు వేలకు పెంచాలని కోరారు. ప్రమాదాలు జరుగకుండా ప్రతి గీత కార్మికునికి తాటి చెట్లు ఎక్కే మిషన్లు ఇవ్వాలని అన్నారు. వైన్స్ షాప్ ల కేటాయింపులో గౌడు లకు 15%రిజర్వేషన్ తో ఒరిగేది ఏమి లేదని అన్నారు.

ఏజెన్సీ లో గీత వృత్తి చేస్తున్న గీత కార్మికుల కు ప్రభుత్వం నుండి ఎటువంటి సంక్షేమ పథకాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. తక్షణమే ఎక్సైజ్ శాఖ మంత్రి గీత కార్మికులతో సమావేశం నిర్వహించాలని అన్నారు. జిల్లా కేంద్ర లో నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వైన్ షాపులు పెంచకుండా జనాభా కు తగ్గట్టు పిహెచ్ సిలు ఏర్పాటు చేయాలని కోరారు. మద్యాన్ని దశల వారీగా నియంత్రణ చేయాలనీ డిమాండ్ చేశారు. సమస్య ల పరిష్కారం కొరకు సర్వాయి పాపన్న స్పూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని గీత కార్మికుల కు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో గౌడసంఘo. జిల్లా నాయకులు కునూరు అశోక్ గౌడ్, నాగపూరి హరినాద్ గౌడ్, పంజలా తిరుపతి గౌడ్, బోడిగే బిక్షపతి గౌడ్, శ్యాం గౌడ్, మునిగాలా రవిగౌడ్, మూల జగదీశ్ గౌడ్, చిరంజీవి గౌడ్, వెంకటేశ్వర్లు గౌడ్, నర్సయ్య గౌడ్, నరేందర్ గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజకీయ వైఫల్యంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

Satyam NEWS

ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ను వెంటనే విడుదల చేయాలి

Satyam NEWS

సందీప్ రెడ్డి  మరణం తీరని లోటు

Satyam NEWS

Leave a Comment