27.7 C
Hyderabad
April 26, 2024 03: 59 AM
Slider శ్రీకాకుళం

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

#Savitribai Phule Jayanti

శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలస లో ప్రధానోపాధ్యాయులు ఐ. డి. వి ప్రసాద్ అధ్యక్షతన సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు జరిగాయి. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలతో సత్కరించడం జరిగినది. సమావేశాన్ని ఉద్దేశించి సాంఘిక శాస్త్ర సీనియర్ ఉపాధ్యాయిని బెండి శారద మాట్లాడారు.

ఆనాటి కాలంలో స్త్రీలు చదువుకోని రోజులలో బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించి బాలికల విద్యకు ప్రోత్సహించిన సావిత్రిబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె వివరించారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తూ మరొకపక్క సంఘములో ఉన్న దురాచారాలను కూడా రూపుమాపుతూ సంఘసంస్కర్తగా నిలుస్తూ నేటి మహిళా ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారని సావిత్రిబాయి పూలేను కొనియాడారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులైన బెండి శారద, సంపతి రావు రమణమ్మ, పొన్నాన ఉషారాణి ,నక్కిన స్వప్న, తంగి పద్మావతి లను ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కరణం శ్రీహరి, బలివాడ ప్రభాకర రావు, బుడుమూరు అప్పలనాయుడు, పిసిని వసంతరావు, గండ్రేటి వినయ్ కుమార్, రాజనాల సతీష్ రాయుడు, కొణపల శ్రీనివాసరావు బొంగువెంకటరమణమూర్తి, సి.ఆర్.పి పంచిరెడ్డి మోహన రావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ప్రొటెస్టు: కూలీలకు దక్కని కరోనా సాయం

Satyam NEWS

Vermont Cbd Hemp

Bhavani

శాటిస్ఫైడ్: పెద్దపాడు పాఠశాల ఆకస్మికంగా తనిఖీ

Satyam NEWS

Leave a Comment