దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారుల బృందం జ్యూరిచ్ చేరుకున్నది. కాసేపటి క్రితం సీఎం చంద్రబాబు, సభ్యుల బృందం జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నది. విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులకు యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్ వెళ్లిన వారిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందం ఉన్నది. కాసేపట్లో పెట్టుబడిదారులతో జ్యూరిచ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సమావేశం కానున్నారు.
previous post