ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో ఉన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి అడుగడుగునా జనసేన శ్రేణులు, రైతులు ఘన స్వాగతం పలుకుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యం బకాయిలు విడుదల చేసినందుకు రైతులు మనోహర్ కి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ధాన్యం సొమ్ము కోసం నెలల తరబడి వేచి చూసే పరిస్థితి రాకుండా చూస్తామని మనోహర్ భరోసా ఇచ్చారు.
ఏలూరు నుంచి అమలాపురం మార్గం మధ్యలో కోనసీమ ముఖద్వారం రావులపాలెం, కొత్తపేట, అవిడి, ముక్కామల తదితర ప్రాంతాల్లో మనోహర్ కి పూల వర్షంతో స్వాగతం పలికారు. ఈతకోట దగ్గర బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, గిడ్డి సత్యనారాయణ, దేవ వర ప్రసాద్, వేగుళ్ల జోగేశ్వర రావు, జనసేన నేతలు బండారు శ్రీనివాస్, వేగుళ్ల లీలాకృష్ణ, పోలిశెట్టి చంద్ర శేఖర్ తదితరులు నాదెండ్ల మనోహర్ కి స్వాగతం పలికారు.