ఉమ్మడి కడప జిల్లా యందు జిల్లా స్థాయి అబాకస్ పోటీ పరీక్షలయందు రాజంపేట మండలం తాళ్ళపాక భారతీయ విధ్యానికేతన్ హై స్కూల్ నందు 5 వ తరగతి చదువుతున్న వై. ధనుష్ కృష్ణ మొదటి బహుమతి సాధించగా, 4 వ తరగతి చదువుతున్న కె. యాషిక కన్సోలేషన్ బహుమతి సాధించారు.
ఈ సందర్భంగా భారతీయ విధ్యానికేతన్ హై స్కూల్ చైర్మెన్ కొండూరు శరత్ కుమార్ రాజు ,డైరెక్టర్ భారత్ కుమార్ రాజు విద్యార్థులను అభినందించి వారికి బహుమతులు ప్రధానం చేశారు.
అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు వారిని తీర్చిదిద్దిన స్కూల్ యజమాన్యానికి మరియు ప్రిన్సిపల్ రాము, అధ్యాపక బృంధానికి కృతజ్ఞతలు తెలియజేశారు.