27.7 C
Hyderabad
April 20, 2024 01: 43 AM
Slider విజయనగరం

జగన్ ప్రభుత్వం పై గ్రీన్ అంబాసిడర్ కార్మికులు ధ్వజం..!

#Greenambassador

రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పది హేను నెలల జీతాలకు గాను ముష్టి మూడు నెలల జీతం వేస్తారా అంటూ విజయనగరం కలెక్టరేట్ ఎదుట గ్రీన్ అంబాసిడర్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా…గ్రామీణ ప్రాంతాల్లో చెత్తాచెదారం, కాలువలు తీసే పారిశుద్ధ్య కార్మికులు గ్రీన్ అంబాసిడర్ కార్మికుల జీతాల కోసం కేటాయించిన నిధులను ఉచిత పథకాలకు మళ్ళించి కార్మికులను ఆకలితో చంపుతారా అని జగన్ ప్రభుత్వం పై విజయనగరం జిల్లా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్, యూనియన్ జిల్లా కన్వీనర్ పురం అప్పారావులు మండిపడ్డారు.

ఈ మేరకు ఏ.పి గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ యూనియన్ జిల్లా కన్వీనర్ పురం అప్పారావు నేతృత్వంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన అనంతరం స్పందన కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ ఏఐటీయూసీ జిల్లా పది హేను నెలల జీతానికి గాను ముష్టి మూడునెలల జీతం వేస్తారా అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా మీరు, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి నెలా జీతాలు తీసుకుంటూ మీ ప్రాంతాల్లో మురికివాడలు శుభ్రం చేస్తూ మీ ఆరోగ్యాలను, ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ కార్మికులు రోగాల భారిన పడుతూ త్యాగం చేస్తున్న కార్మికుల జీతాలు మాత్రం ప్రతీ నెలా ఇవ్వరా అని ప్రశ్నించారు. మీరంతా ఒక్క నెల జీతం తీసుకోకుండా ఉండగలరా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికులకు మీరు అసెంబ్లీలో చెప్పిన ప్రకారం 18 వేలు వేతనం పెంచకపోతే ప్రత్యక్ష పోరాటం తప్పదని హెచ్చరించారు. రానున్నవి పండగ రోజులు కాబట్టి 15 నెలలుగా పెండింగులో ఉన్న జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరం అయ్యేవరకు గ్రీన్ అంబాసిడర్ కార్మికులందరికి ఏఐటీయూసీ అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే దశాలవారి పోరాటాలు తప్పవని వారు హెచ్చరించారు.

ఈ ధర్నా లో అధ్యక్షుడు దాసరి పూడయ్యా, ప్రధాన కార్యదర్శి బొత్స పోలిరాజు, ఉపాధ్యక్షుడు గంగరాజు, సహాయ కార్యదర్శి అచ్చప్పడు, కోశాధికారి సీతారాం, మెంబర్లు బంగారి అప్పలరాజు, నాగరాజు, వడ్డాది రమణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరావతి పై కాలు పెట్టి చేతులు కాల్చుకున్నారు

Bhavani

ఢిల్లీ జేఎన్‌యూ వద్ద బలగాల మోహరింపు

Satyam NEWS

నియంత పాలన ఇంకానా…. ఇంకెంత కాలం??

Satyam NEWS

Leave a Comment