30.7 C
Hyderabad
April 17, 2024 00: 57 AM
Slider వరంగల్

గ్రీన్ ఛాలెంజ్ మొక్కలను నాటిన పోలీస్ అధికారులు

#GreenChallenge

పర్యవరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులతో ఉద్యమంగా కొనసాగుతున్నది. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా వరంగల్  పోలీస్ కమిషనర్  ఐజీ ప్రమోద్ కుమార్ చేసిన గ్రీన్ ఛాలెంజ్ ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ ఇంచార్జ్ పుష్పా స్వీకరించారు.

అదే విధంగా ఆర్మూడ్ రిజర్వ్ విభాగం అదనపు డి.సి.పి భీంరావు లు వారి వారి  కార్యాలయాల ఆవరణలో  మొక్కలను నాటారు. వాటి సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం  వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, వరంగల్ ఎసిపి ప్రతాప్, హన్మకొండ  ఏ.సి.పి జితేందర్, కాజీపేట ఎ.సి.పి రవీంద్రకుమార్ లను  గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరారు.

 అదనపు డి.సి.పి భీంరావు  ఆర్మూడ్ రిజర్వ్  అదనపు డి.సి.పి గిరిరాజు, రిజర్వ్  ఇన్స్‌పెక్టర్లు భాస్కర్, శ్రీనివాస రావులకు గ్రీన్  ఛాలెంజ్ చేశారు.

ఈ సందర్భంగా ఇరువురు అధికారులు మాట్లాడుతూ హారతాహరం కార్యక్రమాన్ని  రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు యం.పీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్  ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలవారికి కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడంతో పాటు, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రత్యక్ష భాగస్వామలవుదామని పోలీస్ అధికారులు పిలుపునిచ్చారు.

Related posts

ఖమ్మం జిల్లా పర్యటనలో షర్మిలకు అస్వస్థత

Satyam NEWS

సిజెఆర్ సమక్షంలో కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే బీరం వర్గీయులు

Satyam NEWS

చిన్నంబాయిలో కోర్టు ఏర్పాటు చేయాలని వినతి

Satyam NEWS

Leave a Comment