32.2 C
Hyderabad
March 28, 2024 22: 59 PM
Slider వరంగల్

అందరూ పండ్ల మొక్కలు నాటితే మంచిది

dayakarrao

టిఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ దేశ వ్యాప్తంగా ఉద్యమంలా నడుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో జర్నలిస్టులు చేపట్టిన తెలంగాణ హరితహారంలో నేడు ఆయన పాల్గొన్నారు.

ఆయనతో బాటు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండా ప్రకాష్ రావు తదితరులు కూడా పాల్గొన్నారు. అన్ని రంగాల వారు పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషం. యూనివర్సిటీ బృందం పాల్గొనడం అభినందనీయం. మీడియా ప్రతినిధులు ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం అభినందనీయం అని మంత్రి దయాకర్ రావు అన్నారు.

 ఈ సందర్భంగా సినీ నిర్మాత దిల్ రాజుతో పాటు మరో నలుగురు మీడియా అధినేతలు రామోజీరావు, రాధాకృష్ణ, నరేంద్ర చౌదరి, రామేశ్వర్ రావు లకు గ్రీన్ ఛాలెంజ్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో కోతుల ఇబ్బంది తగ్గాలి అంటే అందరూ అడవిలో పండ్ల మొక్కలు నాటాలని ఆయన అన్నారు.

Related posts

ఉద్యమ పార్టీని విడుతున్న మాజీ మంత్రి జూపల్లి?….ఆ రోజే ప్రకటన!

Satyam NEWS

గిరి వికాసం: గిరిజనుల వ్యవసాయ భూముల అభివృద్ధికి పథకం

Satyam NEWS

స్కూలు విద్యార్ధుల కోసం టీవీ బహూకరణ

Satyam NEWS

Leave a Comment