తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం అద్వితీయమైన కార్యక్రమమని నర్సాపురం పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారానికి కొనసాగింపుగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ప్రారంభించారని ఆయన అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమమని ఆయన అన్నారు. మొక్కలు లేనిదే మానవాళి లేదని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక మహత్తర ఉద్యమంగా మారి బంగారు తెలంగాణ లో భాగంగా హరిత తెలంగాణ ఏర్పడుతుందని ఆయన అన్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తో పాటుగా తెలంగాణ చక్కటి, పచ్చటి తెలంగాణ కావాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు. నేడు ఆయన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ కి ప్రజల సహకారం ఉండాలని ఆయన కోరారు. సినీ హీరో బాలకృష్ణ ,సినీ నిర్మాత అశ్వినీ దత్, మాజీ క్రికెట్ ప్లేయర్ చాముండేశ్వర్ నాథ్ కు రఘురామకృష్ణంరాజు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.