39.2 C
Hyderabad
March 29, 2024 16: 23 PM
Slider నెల్లూరు

విక్రమ సింహపురి యూనివర్సిటీ కి గ్రీన్ ఛాంపియన్ అవార్డు

#vikram simhapuri university

మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ ఈ రోజు వర్చువల్ విధానంలో స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ పై ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో పరిధిలో పచ్చదనం పెంపొందించినందుకు, ప్రణాళికలు రూపొందించినందుకు గ్రీన్ ఛాంపియన్  అవార్డు ను నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవిఎన్ చక్రధర్ బాబు చే అందచేశారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ బుడితి రాజశేఖర్ యూనివర్సిటీ అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలిపారు. తదనంతరం యూనివర్సిటీ నిర్వహించిన స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ వర్క్ షాప్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవిఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ గ్రీన్ ఛాంపియన్ అవార్డుకు ఎంపిక చేసిన  MGNCRE బృందానికి అభినందనలు తెలుపుతూ యూనివర్సిటీలో పచ్చదనం, పరిశుభ్రత, ప్రకృతి వ్యవసాయం, మొక్కలు నాటడం , ప్లాస్టిక్ నియంత్రణ , కిచెన్ గార్డెన్ , హెర్బల్ గార్డెన్ వంటి అంశాల పట్ల కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు.

ఇలా ప్రతి ఒక్క సంస్థ చేయగలిగితే భవిష్యత్తులో ప్రకృతి మనకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన రెక్టర్ ఆచార్య ఎం. చంద్రయ్య మాట్లాడుతూ ఇలాంటి అవార్డును భవిష్యత్తులో కూడా పొందే విధంగా మరింతగా కృషి చేసి ప్రణాళికాబద్ధంగా యూనివర్సిటీలో స్వచ్ఛత కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్.విజయ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ లో భాగంగా యూనివర్సిటీలో విద్యుత్ ని నీటిని పొదుపుగా వాడాలి అని యూనివర్సిటీ లోని ప్రతి ఉద్యోగి తన ఇంటిలో పొదుపుగా వాడి నట్లే యూనివర్సిటీలో కూడా పొదుపుగా వాడగల్గితే మనం స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ ను సమర్థవంతంగా నిర్వహించగలము తెలిపారు.

ఈ కార్యక్రమంలో ద్రవిడ విశ్వవిద్యాలయం ఉన్నత్ భారత్ అభియాన్ కోఆర్డినేటర్ ఆర్.యశోద మాట్లాడుతూ స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ సంబంధించినటువంటి వివరాలను తెలియజేశారు. అనంతరం వర్క్ షాప్ కోఆర్డినేటర్ సోషల్ వర్క్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ .మధుమతి గ్రీన్ ఛాంపియన్ అవార్డు పొందడానికి కారణాలను, చేపట్టిన కార్యక్రమాల వివరాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజనా నాయర్, ఆంధ్రప్రదేశ్ మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఎం. సాయి కిరణ్, జిల్లా ఎన్ యస్ యస్ సమన్వయ కర్త  డాక్టర్ అల్లం ఉదయ శంకర్, ఎన్ యస్ యస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్  ఆర్ . ప్రభాకర్, డాక్టర్ వై . విజయ, హాస్టల్ వార్డెన్ హనుమ రెడ్డి, సాయినాథ్, మేరీ సందీపా, యూనివర్సిటీ ఉన్నత్ భారత్ అభియాన్ సమన్వయ డాక్టర్ కే. సునీత, గ్రీన్ క్లబ్ మెంబర్ కన్య రావు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

సభ్యత్వ నమోదులో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలి

Satyam NEWS

న్యూ జనరేషన్ అగ్ని క్షిపణి ప్రయోగం విజయవంతం

Satyam NEWS

TNGO కొల్లాపూర్ డివిజన్ టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment