28.7 C
Hyderabad
April 20, 2024 10: 21 AM
Slider పశ్చిమగోదావరి

రేచర్లలో గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల నిరసన ధర్నా

#greenfield

గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం భూములను బలవంతంగా లాక్కోవడంతో రోడ్డున పడ్డామని ఏలూరు జిల్లా గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు రెవెన్యూ అధికారులు, హైవే ప్రాజెక్టు అధికారులు రేచర్ల లో నిర్వహించిన గ్రామసభలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామసభ అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మాకు పరిహారం సంగతి తేల్చకుండా రోడ్డు పనులు చేపడితే అడ్డుకుంటాం అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ 2013 భూసేకరం చట్టంపై తగిన అవగాహన కల్పించి తక్కువ పరిహారం పొందిన రైతులు ఆర్పిటేషన్ పిటిషన్లు దాఖలు చేసే విధానాన్ని అధికారులు తెలియజేయకపోవడం చట్ట విరుద్ధమన్నారు. భూ సేకరణ చట్టంలో ఉన్న అంశాలను రైతులకు చెప్పకుండా బలవంతంగా భూములు లాక్కోవడం దుర్మార్గమని విమర్శించారు. పేద రైతులు ఆర్బిట్రేషన్ పిటిషన్లు దాఖలు తీసుకోలేని అమాయక స్థితిలో ఉన్నారని ఈ పరిస్థితుల్లో చట్ట ప్రకారం జిల్లా కలెక్టర్ రైతులతో  చర్చలు జరిపి పరిహారం పెంచి ఇవ్వాలని కోరారు. పట్టిసీమ ఎత్తిపోతలు తరహా లో పరిహారం ఇచ్చి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రజలకు అవసరమైన అన్ని చోట్ల సర్వీస్ రోడ్లు, అండర్ పాస్ లు నిర్మించాలని కోరారు. చెట్లు, షెడ్లు, బోర్లకు పరిహారం పెంచి ఇవ్వాలన్నారు.

కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు గురవయ్య, చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు చిట్లూరి అంజిబాబు మాట్లాడారు. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు పెన్మత్స సత్యనారాయణ రాజు, ఉప్పల శ్రీనివాసరావు, కంచర్ల శ్రీనివాస్, దొంతా బాల వెంకటేశ్వర్లు, బాణావతు శ్రీనివాసరావు, తాళ్ల వెంకటేశ్వరరావు, నల్లూరి కృష్ణారావు, అత్తులూరి నవీన్ కుమార్, పునకాల రాఘవులు, కొండు బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోనసీమ తగలబడటానికి కారణం ఎవరు?

Satyam NEWS

వెయ్యి రూపాయ‌ల కోసం ఎస్పీ మీడియా స‌మావేశం

Satyam NEWS

పొంగులేటీ…. తప్పుడు ప్రచారం మానుకో

Satyam NEWS

Leave a Comment