28.2 C
Hyderabad
April 20, 2024 12: 57 PM
Slider సినిమా

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన అక్కినేని సమంత

#Akkineni Samantha

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన అక్కినేని నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు.

తన మామ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన అక్కినేని కోడలు సమంత ఈ రోజు జూబీలీహిల్స్ లోని తన నివాసంలో తన కుటుంబసభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు. అనంతరం సమంత మాట్లాడుతూ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని, పెరిగిపోతున్న కాలుష్యానికి బ్రేక్ వేయడానికి ఇది ఒక వెపన్ లా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు.

అంతేకాదు తన అభిమానులందరి ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను ముందుకు తీసుకుపోయేలా.. ప్రతి ఒక్క అభిమాని మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చింది. ఇక తన కోస్టార్స్ మహానటి కీర్తి సురేష్, టాలీవుడ్ బ్యూటీ రష్మీక మందాన్నకు ఛాలెంజ్ విసిరిన సమంత.. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

సత్యం న్యూస్ వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు

Satyam NEWS

సీఆర్ఫీఎఫ్ అమరులకు రూ.35 లక్షల ఎక్స్ గ్రేషియా

Sub Editor

మంత్రి వచ్చిన ప్రతి సారీ మిమ్మల్ని అరెస్టు చేస్తారా?

Satyam NEWS

Leave a Comment