28.7 C
Hyderabad
April 20, 2024 08: 48 AM
Slider సినిమా

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన యువ నటి నక్షత్ర

#Heroine Nakshtra

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఆదర్శ నగర్ లో యువ హీరోయిన్ నక్షత్ర ( పలసా 1978 సినిమా) మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నక్షత్ర మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అని అందులో భాగంగా తాను మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.

పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా “విరివిగా మొక్కలు నాటండి పచ్చదనాన్ని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అని తెలిపారు”. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్, హీరోయిన్ రమ్యకృష్ణ ,పలాస 1978 సినిమా డైరెక్టర్ కరుణ కుమార్ లను గ్రీన్ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో  గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

Related posts

రిలీఫ్ ఫండ్: విలేఖరి కుటుంబానికి ఆర్థిక సహాయం

Satyam NEWS

అల్లరి చేస్తున్నది చంద్రబాబు బినామీలే

Satyam NEWS

ఇళ్ళ స్వాధీనంపై ప్రభుత్వం కుట్ర

Sub Editor

Leave a Comment