17వ తేదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒక మొక్కను నాటుదాం. ఆయనపై అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకుందాం అని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. కేసీఆర్ పైనున్న అభిమానాన్ని సమాజ హితానికి వాడుకుందామని ఆయన అన్నారు. కేసీఆర్ పేరుతో మొక్కను నాటుదాం..సాదుకుందాం..ముఖ్యమంత్రి కేసీఆర్ కి మన జీవితకాలపు కానుకనిద్దాం..మన ప్రియతమ నాయకుని మీద ప్రేమను ప్రకటిద్దాం.. అని ఆయన అన్నారు.
సెల్ఫీ విత్ సిఎం సర్ సాప్లింగ్… అనే నినాదాన్ని స్పూర్తిగా తీసుకోని సిఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా‘‘సిఎం కెసిఆర్’’ మొక్కను నాటి ఫోన్ నెంబర్ 8790909999 కు పంపాలని ఆయన కోరారు. యువనేత కేటిఆర్ #eachoneplantone పిలుపునందుకుని, ప్రతి ఒక్కరూ ‘సిఎం కెసిఆర్’ పేరుతో మొక్కను నాటుదామని ఆయన అన్నారు.