24.7 C
Hyderabad
March 29, 2024 07: 26 AM
Slider

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన డిసిపి

mandamarri dcp

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో  అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని మంచిర్యాల డిసిపి డి.ఉదయ్ కుమార్ రెడ్డి  పిలుపునిచ్చారు. రాజ్యసభ్య సభ్యులు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో  భాగంగా ఈ రోజు మంచిర్యాల డిసిపి కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మంచిర్యాల  డిసిపి డి.ఉదయ కుమార్,  మొక్కలను నాటారు. మరో మూడు మొక్కలను నాటేందుకు ఎసిపి,సీఐ ,ఎస్ఐ, ప్రజలను ఆహ్వానించారు. డిసిపి మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని  లోని హోం గార్డ్ అధికారి నుండి ఉన్నత అధికారి వరకు  ప్రతి ఒక పోలీస్ సిబ్బంది, ప్రజలు  మూడు మొక్కలు నాటి మూడు సంవత్సరాల పాటు సంరక్షించాలన్నారు.

మొక్కల పెంపకం లేకపోవడం వల్ల కాలుష్యం పెరిగిపోతున్నదని తెలిపారు. పర్యావరాన్ని పరిరక్షించే చర్యలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

మొక్కలు నాటి సంరక్షణ భాద్యతలు సమర్దవంతంగా నిర్వర్తిస్తే అవి వృక్షాలు గా ఎదిగి పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయి. తద్వారా వర్షాలు కురుస్తాయి. ఎక్కడ చూసినా పచ్చదనమే ఉంటుందన్నారు.  రాజ్యసభ్య సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగించడం అభినందనీయమన్నారు. ప్రజలందరూ, యువత ముందుకు వచ్చి అందరు భాగస్వామ్యులు కావాలన్నారు.

Related posts

మతమార్పిడి పేరుతో యవతిని చంపిన వారిని ఉరి తీయాలి

Satyam NEWS

వెరైటీ: కాబోయే తల్లుల కోసం ఆహ్లాదం పంచుదాం

Satyam NEWS

అగ్రస్తానంలో రాహుల్

Murali Krishna

Leave a Comment