28.7 C
Hyderabad
April 20, 2024 04: 11 AM
Slider నల్గొండ

సూర్యాపేట లో స్వచ్చ్ సర్వేక్షన్ 2 కె రన్ గ్రాండ్ సక్సెస్

#MinisterJagadeeshreddy

స్వచ్ఛ సర్వేక్షన్‌ -2021లో సూర్యాపేట మున్సిపాలిటీ ని అగ్రస్థానంలో నిలుపుదామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. 

శుక్రవారం రన్‌ ఫర్‌ స్వచ్ఛ సూర్యాపేట  పేరిట పట్టణంలో 2కె రన్‌ నిర్వహించారు.  పట్టణం లోని  మినీ ట్యాన్క్ బండ్ సమీపంలో ని బతుకమ్మ  ఘాట్ నుంచి  వరకు మినీ ట్యాన్క్ బండ్ పై 2 కె  పరుగు కొనసాగింది. కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి.. స్థానికులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చివరి వరకు పరుగు తీశారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… సూర్యాపేట ను పరిశుభ్రంగా, పచ్చదనం గా ఉంచడం లో పేట ప్రజల భాగస్వామ్యం చాలా గొప్పగా ఉందని కొనియాడారు.దేశంలో నే తడి చెత్త, పొడి చెత్త  కాన్సెప్ట్ ను సూర్యాపేట లోనే ప్రారంభించామన్న మంత్రి చెత్త వ్యర్థాలను ద్వారా సామాజిక అవసరాలకు ఉపయోగపడే వస్తువులను తయారు చేసి దేశంలో నే సూర్యాపేట మున్సిపాలిటీ ఆదర్శంగా నిలిచిందన్నారు.

ఏ ప్రభుత్వ కార్యక్రమాలు అయినా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే విజయ వంతం అవుతాయన్నారు. సూర్యాపేట లో ఒకప్పుడు సద్దుల చెరువు వద్దకు రావాలంటేనే ప్రజలు భయపడిన రోజులు పోయి సద్దుల చెరువు మినీ ట్యాన్క్ బండ్ వద్దకు వెలితేనే ఆహ్లాదకరంగా ఉంటుంది అనుకునే రోజులు వచ్చాయన్నారు.

2 కె రన్ లో  యువత, ప్రజలు  ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో సూర్యాపేట ను ను మొదటిస్థానంలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తి కొనసాగించాలన్నారు. ‘స్వచ్ఛ సూర్యాపేట , భారత్‌ ’ సాధించే లక్ష్యంతో పనిచేస్తానని ఫ్లెక్సీపై రూపొందించిన ప్రతిజ్ఞకు మద్దతు తెలుపుతూ మంత్రి తొలి సంతకం చేశారు.

ప్రజలు ఉత్సాహంగా సంతకాలు పెట్టారు. 2 కె రన్ సందర్భంగా చిన్నారులు ట్యాన్క్ బండ్ పై   ప్రదర్శించిన  కరాటే విన్యాసాలను మంత్రి తిలకించి వారిని అభినందించారు.

కార్యక్రమంలో పోలీస్ , మున్సిపల్, రెవిన్యూ సిబ్బంది తో పాటు  ఎంపి బడుగుల , మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ,గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా దేవి,రాష్ట్ర టి.ఆర్.ఎస్ కార్యదర్శి వై.వీ,  మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, జడ్పీటిసి జీడీ బిక్షం,  కౌన్సిలర్లు, టి.ఆర్.ఎస్ నేతలు, పాల్గొన్నారు.

Related posts

గుంటూరు జిల్లా వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

Satyam NEWS

నులి పురుగుల మందు సరఫరా కార్యక్రమం ప్రారంభం

Satyam NEWS

గౌలీ కుల తొలి సర్టిఫికెట్ లక్ష్మీప్రియకు అందజేసిన వినోద్ కుమార్

Satyam NEWS

Leave a Comment