28.7 C
Hyderabad
April 20, 2024 03: 15 AM
Slider మహబూబ్ నగర్

ఆకుపచ్చ తెలంగాణ గా రాష్టాన్ని తీర్చిదిద్దుదాం

#Jupally Krishnarao

ఎన్నో ఉద్యమాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి తోపాటు పచ్చదనాన్ని సాధించుకోవాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. హరిత తెలంగాణే  సీఎం కేసీఆర్ లక్ష్యమని అంతే ప్రతి ఏటా హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుడుతున్నారని జూపల్లి అన్నారు.

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపు నిచ్చారు. నేడు కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. 1 వ వార్డు కౌన్సిలర్ పిన్నం శెట్టి జ్యోతి శేఖర్, 6 వార్డు కౌన్సిలర్ మేకల రమ్య నాగరాజు, 8 వ వార్డు కౌన్సిలర్ బరిగెల లక్ష్మీ వేణు,9వ వార్డు కౌన్సిలర్ నయీమ్,10 వ వార్డు కౌన్సిలర్ షేక్ రహీం పాషా 11 వవార్డు కౌన్సిలర్ బొరెల్లి కరుణ మహేష్,13 వ వార్డు కౌన్సిలర్ మేకల శిరీష కిరణ్ యాదవ్ వివిధ ఏరియాలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాపితంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా 6 వ విడత హరిత హారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని తెలిపారు. పట్టణంలో తమ తమ వార్డుల్లో ఆయా కౌన్సిలర్లు బాధ్యత తీసుకొని 500 మొక్కలను నాటే విధంగా లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగాలని నాటే ప్రతి మొక్క సంరక్షణకు కృషి చేయాలని సూచించారు.

 అనంతరం బస్టాండ్ ఆవరణ, నూతన గ్రంధాయలయ యోగ భవనం ముందు తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. చౌట బెట్ల గ్రామంలో హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు సింగిల్ విండో డైరెక్టర్ లు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ వార్డుల కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.

Related posts

కేసీఆర్ అవినీతిని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా: ఎంపీ కోమ‌టిరెడ్డి

Satyam NEWS

స్కూళ్లకు సెలవు

Bhavani

అల్లరి చేస్తున్నది చంద్రబాబు బినామీలే

Satyam NEWS

Leave a Comment