27.7 C
Hyderabad
March 29, 2024 04: 16 AM
Slider నల్గొండ

జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు

#daggubatiramarao

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16వ,తేదిన జాతీయ పత్రికాదినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, గతంలో 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16వ,తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగిందని, నాటి నుండి నేటి వరుకు ప్రతి సంవత్సరం నవంబర్ 16వ,తేదిన జాతీయ పత్రికా(నేషనల్‌ ప్రెస్‌ డే) దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు అన్నారు.

ఈ సందర్భంగా దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ ఒక దేశములో ప్రజాస్వామ్యము సక్రమముగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలని చాల మంది భావనని, పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్య్రం అమలవుతుందంటే ఆ దేశములో ప్రజాస్వామ్య పాలనకు ఎటువంటి ఇబ్బందులు లేవనే చెప్పాలని అన్నారు.

ఎప్పటికైనా పత్రికా స్వేచ్ఛ కోసంమే పని చేయాలన్నదే ముఖ్య లక్ష్యం కావాలని, ప్రపంచంలో అనేక దేశాలలో ప్రెస్‌ కౌన్సిళ్లు కూడా ఉన్నాయని అన్నారు. మన దేశ కౌన్సిల్‌కు ఉన్న ప్రత్యేకత, గుర్తింపు ఏమంటే ప్రభుత్వ శాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం లభించడమే అని,పత్రికలు,మీడియా స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకొని అమలు జరిపే విధంగా ప్రెస్‌ కౌన్సిల్‌ అందరిని ఉత్సాహంగా ముందుకు కొనసాగిస్తుందని అంటూ బాబురావు జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ప్రొఫెసర్ జయ శంకర్ సార్ ఆశయ సాధన దిశగా పాలన

Satyam NEWS

ఆమె

Satyam NEWS

కమిట్మెంట్:దుర్వాసన లేకుండా ధర్మగుండం బాగుపరిచేదెలా

Satyam NEWS

Leave a Comment