35.2 C
Hyderabad
April 20, 2024 17: 31 PM
Slider విజయనగరం

ఇక ప్రతి శుక్రవారం శాఖా సిబ్బందికి గ్రీవెన్స్: విజయనగరం ఎస్పీ

#vijayanagaramcollector

అక్టోబ‌ర్ 21..పోలీస్ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం..ఈ రోజును ఎవ్వ‌రూ మ‌ర్చిపోరు అందునా ప్ర‌తి పోలీస్ సిబ్బందికి గుర్తుండిపోయే రోజు. ఇదే రోజు 1959లో ల‌డాఖ్ లో ప‌దిమంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల మృతికి చిహ్నంగా పోలీసుల అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీ గావస్తోంది. దేశ‌మంత‌గా ఈ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న వేళ‌…ఏపీ లో కూడా పోలీసుల అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలోనే ఉత్తరాంధ్రలోని విజ‌య‌న‌గరం జిల్లా పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్ స‌మీపంలోనే  పోలీసుల స్మృతి మైద‌నాంలో దినోత్స‌వం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా కార్య‌క్ర‌మానికి వ‌చ్చేసిని అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు అంద‌రూ స్మృతి చిహ్నం వ‌ద్ద ఘ‌నంగా నివాళులు అర్పించారు. అంత‌కు ముందు ఆర్మ‌ర్డ్ రిజ‌ర్వు క‌మాండెంట్ రాజ‌శేఖ‌ర్ నుంచీ ప‌రేడ్ స్వాగతం అందుకున్న ఎస్పీ దీపికా మాట్లాడుతూ ఇక నుంచీ సిబ్బంది యోగ క్షేమాల‌పై ప్ర‌తీ శుక్ర‌వారం గ్రీవెన్స్ సెల్ నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

అలాగే ప్రతీ బుద‌వారం మ‌హిళా సిబ్బందికి గ్రీవెన్స్ సెల్ నిర్వ‌హిస్తామ‌ని ఎస్పీ తెలిపారు.కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా వ‌చ్చిన ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ గాజు బంగ్లాలో మ‌నంద‌రం ఉండి  ప‌ని చేస్తున్నా..మ‌నోధైర్యంతో రోడ్ మీద ఉండి ప‌ని చేస్తున్న పోలీస్ సిబ్బందికి శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నానంటూ జిల్లా క‌లెక్ట‌ర్  సూర్య‌కుమారీ అన్నారు.

ఈ సంద‌ర్బంగా అమ‌ర‌వీరుల  సేవలను కొనియాడి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించి, అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి జే.శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ ఎం.శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లు పి.. రఘువర్మ,  పి.వి.వి.సూర్యనారాయణ రాజు, ఎస్ ఈ బి అదనపు ఎస్పీ కుమారి ఎన్.శ్రీదేవి రావు, అదనపు ఎస్పీ  పి సత్యనారాయణరావు, ఓఎస్డీ  ఎన్. సూర్యచంద్ర రావు, డిఎస్పీ లు  అనిల్ పులిపాటి,  ఎ.సుభాష్,  ఆర్.శ్రీనివాసరావు, ఎల్.మోహనరావు, టి.త్రినాథ్, .శేషాద్రి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.అనంత‌రం పోలీసు అమరవీరుల స్మరిస్తూ, వారి సేవలను కొనియాడుతూ న‌గ‌రంలో పోలీస్ కార్యాల‌యం నుంచీ, ఆర్ అండ్ గెస్టు హౌస్ వరకు ర్యాలీ నిర్వహించారు

Related posts

కరోనా పై అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

బెంగళూరు చెన్నైతో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు

Satyam NEWS

ఆనం రామనారాయణ రెడ్డిపై వేటు?

Bhavani

Leave a Comment