39.2 C
Hyderabad
April 25, 2024 15: 08 PM
Slider మహబూబ్ నగర్

Gross Negligence: రోడ్డెక్కిన వసతి గృహ విద్యార్థులు

#KalwakurthyStudents

రేపటి నుండి డిగ్రీ విద్యార్థులకు సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులకు వసతి కల్పించాలని విద్యార్థులు గత రెండు రోజులుగా కళాశాల,వసతి గృహ ఇన్ఛార్జ్ లకు చెప్పిన పట్టించుకోవడంలేదని కళాశాల వసతి గృహ విద్యార్థులు  రోడ్డెక్కారు.

నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలో విద్యార్థుల సమస్యలను కళాశాల,వసతి గృహ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆదివారం వసతి గృహ విద్యార్థులు పట్టణంలోని మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు.

వసతి గృహ విద్యార్థులు రోడ్డుపై  బైఠాయించిన విషయం తెలుసుకున్న బిసి సంక్షేమ సంఘం జిల్లా యువజన అధ్యక్షుడు శశికుమార్ గౌడ్ వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శశికుమార్  మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యే వసతి గృహం విద్యార్థులకు ప్రభుత్వం వసతి కల్పించాలని అన్నారు.

వసతి గృహ విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి పై అధికారులతో మాట్లాడి దూరప్రాంతాల నుంచి పరీక్షలకు హాజరయ్యే వసతి గృహా విద్యార్థులకు వసతి కల్పించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం కల్వకుర్తి టౌన్ ప్రెసిడెంట్ అరుణ్ చారి దివాకర్ గౌడ్ వంశీ నాయక్  చంటి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనాతో ఒకే రోజు నలుగురు జర్నలిస్టుల మృతి

Satyam NEWS

టార్గెట్ పవన్ కల్యాణ్: చేసెయ్ తప్పుడు ప్రచారం

Satyam NEWS

జగన్ రెడ్డి ప్రభుత్వంపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment