37.2 C
Hyderabad
March 29, 2024 18: 15 PM
Slider తూర్పుగోదావరి

మరో వూహాన్ లా మారిన తూర్పుగోదావరి జిల్లా

#NallmilliRamakrishnareddy

రాష్ట్రంలో రోజు రోజుకి  కరోనా పాజిటివ్ కేసులు పెరుగుపోతున్నాయని, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల నమోదులో గత పది రోజులుగా మొదటి స్థానంలో ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

అనపర్తి మండలం రామవరంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అధికార యంత్రాంగం వైఫల్యం వలనే  తూర్పుగోదావరి జిల్లా మరో వూహాన్ గా తయారైందని ఆయన తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ టెస్ట్ పాజిటివ్ రేట్ 17.20% తో ప్రధమ స్థానంలో ఉందని ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్ లో నిన్న ఒక్క రోజు 1,29,000 టెస్టులు చేస్తే 4571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని,కానీ ఆంధ్రప్రదేశ్ లో 62900 టెస్టులకు 10820 పాజిటివ్ కేసులు వచ్చాయి. టెస్టులు ఎక్కువ చేసాం కాబట్టి ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయనే వాదన సరియైనది కాదని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో కనీసం రోజుకు లక్ష టెస్టులు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిన్న ఒక్క రోజు జిల్లాలో 1543 పాజిటివ్ కేసులు నమోదయాయని, గత పది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోందని,జిల్లాలో కరోనా  సామాజిక వ్యాప్తి మొదలైందని, అయిప్పటికి జిల్లాలో పాజిటివ్ కేసులు 32703 కు చేరుకుందని రామకృష్ణారెడ్డి అన్నారు.

జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వలన ఈ సంఖ్య ఇంకా పెరిగుతుందని, కోవిడ్ కు చికిత్స అందిస్తున్న వైద్య నిపుణుల అభిప్రాయం మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ,జిల్లా యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు. జిల్లాలో ప్రతి ఆదివారం విధిస్తున్న కర్ఫ్యూ వెనుక సాంకేతిక కారణం ఏమిటో అధికార యంత్రాంగం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

చిరు వ్యాపారులను ఆదివారం రోజున కట్టడి చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా గాని ,అక్రమ గ్రావెల్ రవాణా గాని యథేచ్ఛగా ఆదివారం కూడా కొనసాగుతోoదని కర్ఫ్యూ వాటికి వర్తించదా? అని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కోవిడ్ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా  కనిపిస్తుందని ఆయన తెలిపారు.

Related posts

కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్

Bhavani

అమరావతి పేరు కూడా వినిపించకుండా పక్కా ప్లాన్

Satyam NEWS

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం

Satyam NEWS

Leave a Comment