24.7 C
Hyderabad
March 29, 2024 07: 32 AM
Slider ముఖ్యంశాలు

గ్రూప్‌-1 కీ విడుదల

#tspsc

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 తుది కీ ప్రకటించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాల నేపథ్యంలో సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబరు 16న జరిగింది. ప్రాథమిక కీని కమిషన్‌ అక్టోబరు 29న ప్రకటించింది. అదేనెల 30 నుంచి నవంబరు 4 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. ఈ ప్రిలిమినరీ కీపై అభ్యర్థుల నుంచి పలు అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సబ్జెక్టు నిపుణుల కమిటీలకు కమిషన్‌ సిఫార్సు చేసింది. ఈ కమిటీ అభ్యంతరాలను క్షుణ్నంగా పరిశీలించి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో ఐదు ప్రశ్నలను తొలగించింది. మరో రెండు ప్రశ్నలకు రెండు కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవిగా ప్రకటించింది. 5 ప్రశ్నలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ మాస్టర్‌ ప్రశ్నపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది. 107వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్‌ లలో ఏది పేర్కొన్నా ఒక మార్కు ఇవ్వనున్నట్లు కమిషన్‌ తెలిపింది. అలాగే 133వ ప్రశ్నకు ఒకటికానీ, రెండుకానీ  ఈ రెండింటిలో ఏ ఆప్షన్‌ గుర్తించినా మార్కు కేటాయించనుంది. 57వ ప్రశ్నకు సమాధానాన్ని ఆప్షన్‌ ఒకటిగా సవరించింది.

గ్రూప్‌-1 పరీక్షలో మొత్తం 150 మార్కులకు 5 ప్రశ్నలను తొలగించినందున 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను 150 మార్కులకు దామాషా పద్ధతిలో తుది మార్కులను లెక్కించింది. నోటిఫికేషన్‌లోని పేరా నం.8(4) ప్రకారం ప్రశ్నలను తొలగించినపుడు వాటిని మినహాయించగా మిగతా ప్రశ్నలకు అభ్యర్థి సాధించిన మార్కులను మొత్తం మార్కుల కింద దామాషా పద్ధతిలో మార్కులు గణించనుంది. ఇవి లెక్కించేటపుడు మూడో డెసిమల్‌ పాయింట్‌ వరకు పరిగణనలోకి తీసుకోనుంది.

Related posts

గాలేరు-నగరి రెండో దశ పనులు పూర్తి కై దశలవారీ పోరాటం

Satyam NEWS

ఏడేళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి 1 లక్ష 87 వేల కోట్ల ఖర్చు

Bhavani

పాలకులే పశువులైతే ప్రజల పరిస్థితి ఏమిటి?

Satyam NEWS

Leave a Comment