మంత్రిగా ఉన్న సమయంలో రోజుకో రకం స్టఫ్‌ని ట్రోలర్స్ కి అందించేవాడు గుడివాడ అమర్ నాథ్. ఆయన చేసే కొన్ని వ్యాఖ్యలు చిన్నపిల్లల మరీ మాదిరిగా ఉండేవి. మానసిక పరిపక్వత లేని వారు చేసే వ్యాఖ్యల తరహాలో ఉండడంతో అందరూ నవ్వుకునేవారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు గుడివాడ అమర్ నాథ్. కానీ, అడపాదడపా వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా కూడా ట్రోలర్స్ కు ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్లట్లేదు.
ఇప్పుడు కూడా ఆణిముత్యం లాంటి మాటలు మాట్లాడారు గుడివాడ. అసలు సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సిన అవసరం ఏముందని గుడివాడ అమర్నాథ్ మీడియా ముందు అనేశారు. సీఎం జేసీబీలు ఇక్కి తిరుగుతున్నారని ఇది పబ్లిసిటీ స్టంటేనని అన్నారు. వైసీపీలో పార్టీ ఆఫీసు నుంచి స్క్రిప్ట్ రానిదే ఎవరూ ప్రెస్ మీట్ పెట్టని సంగతి తెలిసిందే. అలాగే అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో ప్రెస్ మీట్ పెట్టినట్లుగా చెబుతున్నారు.
అయితే, సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి విపత్తులొచ్చినా జగన్ రెడ్డి ఇంట్లో పడుకోవడమూ లేదా పెళ్లిళ్లకు వెళ్లడమో చేసేవారు. తమదే కరెక్ట్ అని వాదించడానికి వైసీపీ ఏ మాత్రం సిగ్గుపడటం లేదని గుడివాడ అమర్ నాథ్ ప్రెస్ మీట్‌తో తేలిపోయింది. కొద్ది రోజులుగా నోరు తెరవని అమర్నాథ్ తో ఇప్పుడీ వాదన వినిపించడం వైసీపీ దివాలా కోరు తనానికి నిదర్శనంగా ఉందని సెటైర్లు పడుతున్నాయి.
నిజానికి ముఖ్యమంత్రి ఫీల్డ్ లో ఉండడం వల్లనే బాధితుల కష్టాలు తెలుసుకొని అందుకు అనుగుణంగా సహాయక చర్యలు చేయగలుగుతున్నారు. చంద్రబాబు ఫీల్డ్ లో ఉంటే పనులు ఎలా జరుగుతాయో.. ఎవరి పర్యవేక్షణ లేకపోతే ఎలా జరుగుతాయో అందరికీ తెలుసు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు ఒక్కోసారి రాత్రి నిద్ర పోకుండా పని చేశారు. అందుకు తగ్గట్లుగానే వదర బాధితులకు సమర్థమైన సాయం కూడా అందిస్తున్నారు.
జగన్ రెడ్డి చేసిన నిర్వాకాలను సమర్థించుకోవడానికి వైసీపీ అధిష్ఠానం ఇలా అమర్ నాథ్ ను పంపిందన్న భావన వ్యక్తం అవుతోంది. పైగా జగన్ రెడ్డి గతంలో ఓసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. విపత్తు ప్రాంతాలకు వెళ్తే తాను సహాయ చర్యలకు అడ్డం అవుతానని చెప్పుకొచ్చారు. ఆయన అడ్డం అవుతారేమో కానీ.. చంద్రబాబు లాంటి వారు మాత్రం.. మాస్టర్ అడ్మినిస్ట్రేషన్ తో నష్టాన్ని వీలైనంత వరకూ తగ్గిస్తారు. అది మరోసారి విజయవాడ వరదల విషయంలో స్పష్టంగా నిరూపితం అయింది. అది తట్టుకోలేకే వైసీపీ నేతలు ఇలా ఏడుస్తున్నారని అంటున్నారు.