37.2 C
Hyderabad
March 29, 2024 20: 15 PM
Slider హైదరాబాద్

మెట్రో రైల్ ఎక్కాలంటే ఈ రూల్సు పాటించాల్సిందే

#HyderabadMetroRail

మెట్రో రైలు సేవలను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మెట్రో రైలు ఎక్కే ప్రయాణికులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. మెట్రో రైలు ఎక్కిన తర్వాత తప్పని సరిగా భౌతిక దూరం పాటించాలి.

ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్​ పూరి విడుదల చేశారు. కంటైన్​మెంట్ జోన్లలోని స్టేషన్లు మూసివేసే ఉంటాయని ఆయన వెల్లడించారు. మార్గదర్శకాలు ఇవి: మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి. లేకపోతే స్టేషన్​లోకి అనుమతించరు.

స్టేషన్లు, ప్లాట్ ఫాం, మెట్రోలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. డబ్బులు చెల్లించి తీసుకునేందుకు అన్ని మెట్రో స్టేషన్లలో మాస్క్ లు అందుబాటులో ఉంచాలి. ఎటువంటి లక్షణాలు లేని వారిని శరీర ఉష్ణోగ్రత పరిశీలించాకే లోనికి అనుమతిస్తారు.

అన్ని ప్రవేశ, నిష్క్రమణలు, లిఫ్ట్ లు, ఎస్కలేటర్ల ప్రదేశాల్లో శానిటైజర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. నేరుగా డబ్బు చెల్లించే అన్ని పద్ధతులు నిలిపివేయాలి. అత్యంత తక్కువ లగేజ్​ను ప్రయాణికులు తీసుకురావాలి. రైళ్లలో ఏసీ సరఫరాలో గాలి మారేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి.

ప్రయాణికులకు అవగాహన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. మెట్రో రైలు కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వం సహా స్థానిక పాలనా సిబ్బంది, పోలీసులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. మెట్రో స్టేషన్ల వద్ద రద్దీ లేకుండా చర్యలు చేపట్టాలి.

Related posts

పల్నాడులో ఫోన్‌ సిగ్నల్స్‌ ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ కోసం…సీపీఎం పాద‌యాత్ర‌…..

Satyam NEWS

దక్కని ఉక్కు కోసం!

Satyam NEWS

Leave a Comment