39.2 C
Hyderabad
April 18, 2024 15: 23 PM
Slider ప్రత్యేకం

మోదీ జనాకర్షణ పైనే గుజరాత్​ బీజేపీ ఆశలు

Gujarat BJP hopes on Modi's popularity

ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ప్రజాదరణ ఉపయోగించుకుని గుజరాత్‌ ఎన్నికల్లో మరోసారి జయకేతనం ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే అధికారంలో ఉండే పార్టీపై వచ్చే ప్రజా వ్యతిరేకత ఆధారంగా గెలవాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మోదీ ఆకర్ష్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత అధిగమించాలని బీజేపీ నేతలు సమాయత్తమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ప్రజాదరణ కు తోడు హిందుత్వ నినాదం ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించి పెడుతుందని గుజరాత్‌లో బీజేపీ భావిస్తోంది. అధికారంలో ఉండే పార్టీపై వ్యక్తమయ్యే ప్రజా వ్యతిరేకతను వీటిద్వారా అధిగమించాలని కమలనాథులు సమాయత్తమవుతున్నారు. తొలి జాబితాలో 160 మంది పేర్లను భాజపా ప్రకటించింది. 111 మంది సిట్టింగు ఎమ్మెల్యేల్లో 69 మందికే మరోసారి అవకాశం కల్పించింది.

అహ్మదాబాద్‌లోనైతే 12 మందిలో 10 మందిని మార్చేసింది. బయటకు కనపడని రీతిలో ప్రభుత్వ వ్యతిరేకత కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది. హిందుత్వ, రామ మందిరం వంటి అంశాలవైపు మొగ్గాలా, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల ఆధారంగా ఎన్నికల్లో స్పందించాలా అనే మీమాంస సగటు ఓటర్లలో ఉంది. దీంతో అలాంటివారి మనసును మార్చడంలో ఏ ఒక్క ప్రయత్నాన్ని వదులుకోరాదని కమలనాథులు తపన పడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడం,

సామాజిక సమీకరణాల సంతులనంలో భాగంగానే 2021 సెప్టెంబరులో విజయ్‌ రూపానీ స్థానంలో భూపేంద్ర పటేల్‌ను తీసుకువచ్చారు. స్వయానా మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కలిసి తీసుకున్న నిర్ణయమది. గుజరాత్‌ 1995 నుంచి ఇంతవరకు కమలానికి కంచుకోటగానే ఉంది. మధ్యలో కొన్నాళ్లు రాష్ట్రపతి పాలన విధించినా మిగిలిన కాలమంతా బీజేపీ సీఎంలే రాష్ట్రాన్ని పాలించారు.

సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ (సాధారణ వ్యక్తి) అని తాను భావిస్తానని చెప్పే పటేల్‌.. ఎలాంటి డాంబికాలకు పోకుండా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారని, తద్వారా అన్నివర్గాల ఓటర్లకు చేరువ అవుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన రాంజీ పటేల్‌ చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చాలావరకు తగ్గిపోతాయనేది ఆయన అంచనా. కాంగ్రెస్‌ బలంగా బరిలో లేకపోవడం, ఆప్‌ ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ కావడం ఈ అంచనాను బలపరుస్తోంది.

Related posts

పుట్టు చికెన్ కూర వండిన హీరోయిన్ రష్మిక మందాన

Satyam NEWS

కఠిన చర్యలు తీసుకోకుంటే.. మూడో వేవ్

Sub Editor

మహోన్నతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Satyam NEWS

Leave a Comment