అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో వారు ముందుగా సందర్శించే గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమంలో పోలీస్ లు భారీగా తనిఖీలు చేపట్టారు. తన పర్యటనలో భాగంగా ట్రంప్ సబర్మతీ ఆశ్రమాన్ని కూడా సందర్శించనున్న నేపథ్యం లో బాంబ్ స్క్వాడ్‌తో పాటు భద్రతా సిబ్బంది ఆశ్రమంలోని అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు.
ట్రంప్ దంపతులు ఈ నెల 24న తొలుత అహ్మదాబాద్ రానున్నారు. ఈ నెల 25న ఢిల్లీకి చేరుకుంటారు.ప్రధాన మన్త్రి మోడీ వారికి ప్రత్యేక స్వాగతం పలుకు తుండగా వారు మొదట అహింస వాది గాంధీజీ ఆశ్రమాన్ని సందర్శించేందుకు మొగ్గు చూపారు.ట్రంప్ దంపతులకు భారీగా స్వాగతం పలికేందుకు ఆశ్రమ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.