25.7 C
Hyderabad
June 22, 2024 05: 05 AM
Slider శ్రీకాకుళం

డాక్టర్ మోహన్ కు మరో జాతీయ స్థాయి పురస్కారం

#bala mohan

2021 సంవత్సరానికి జాతీయ స్థాయి గ్లోబల్ టీచింగ్ ఎక్సలెన్సీ పురస్కారానికి శ్రీకాకుళం జిల్లా పెదపాడు వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ గుండ బాల మోహన్  ఎంపికయ్యారు. కైట్స్ విద్యాసంస్థల అధినేత మనీష్ గౌరు, భారతదేశ బ్రెయిన్ పవర్ అధినేత ఎస్ .హెచ్. దిల్ బాగ్ సింగ్  కరోనా కారణంగా ప్రశంసాపత్రాన్ని పోస్టల్ ద్వారా ఆయనకు పంపారు.

15 సంవత్సరాల నుంచి  వ్యాయామ విద్య వృత్తి లో ఉన్న డాక్టర్ గుండ బాల మోహన్ పలువురు విద్యార్థిని, విద్యార్థులకు శిక్షణ ఇచ్చి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, కుస్తీ పోటీలో నూ, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేలా చేశారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే డాక్టర్ గుండ బాల మోహన్ ఎందరికో సాయం చేశారు.

విద్యార్థినీ విద్యార్థులు అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు కూడా వారికి ఆర్థిక సహాయం అందించేవారు. ఆయన క్రీడా రంగానికి చేసిన సేవ, సామాజిక  సేవలకు గాను జాతీయ స్థాయి గ్లోబల్ టీచింగ్ ఎక్సలెన్సీ  పురస్కారం 2021 కు ఎంపిక చేశారు.

ఈ జాతీయ  స్థాయి  పురస్కారానికి వచ్చిన సందర్భంలో తన తోటి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పెదపాడు ఉన్నత పాఠశాల  ప్రధాన ఉపాధ్యాయిని అమరవాణి, శ్రీకాకుళం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ సభ్యులు పీడీ సాంబమూర్తి, ఎం.వి.రమణ, రాజారావు, పోలినాయుడు, బడి రమణ, ఎం శేఖర్, సతీష్, నిర్మల కృష్ణ, జిల్లా ఒలంపిక్ సంఘం  జిల్లా కార్యదర్శి పి.సుందర రావు, డి.ఎస్.డి.వో,  బి.శ్రీనివాస్ కుమార్, పెద్దపాడు గ్రామ పెద్దలకు కు ఆయన ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ప్రజల రక్షణ గాలికి వదిలి మద్యం షాపులు తెరుస్తారా?

Satyam NEWS

తప్పిన ప్రమాదం.. స్టేషన్ కు చేరిన యవ్వారం….!

Satyam NEWS

ఫిరాయించిన ఎమ్మెల్యేలతో బానిసత్వం చేయిస్తున్నారు

Satyam NEWS

Leave a Comment