28.2 C
Hyderabad
April 20, 2024 11: 41 AM
Slider గుంటూరు

మంగళగిరి కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

#guntursp

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళగిరి పట్టణ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు  జిల్లా SP ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ అధికారులు అసెంబ్లీ సమావేశాలు లలో హాజరు అవుతారు కాబట్టి వారికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సిఐ అంకమ్మ రావు కు ఆదేశాలు జారీచేశారు.

ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, సిబ్బంది పనితీరును, డ్యూటీల నియామకం, రిసెప్షన్ కౌంటర్ నిర్వహణ, లాకప్ తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేసారు. స్టేషన్ లో నమోదైన వివిధ కేసుల ఆ కేసులకు సంబంధించిన వివరాలను SHO అంకమ్మ రావు  ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం  పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసినదిగా ఆదేశాలు జారీ చేసారు. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న కోవిడ్ కేసులు, ఎక్సైజ్ కేసులు, పెండింగ్ లో ఉన్న వారెంట్లు, ఎస్సీ ఎస్టీ కేసులు, గ్రేవ్ కేసులు ఇతర  ముఖ్యమైన కేసు ఫైల్స్ ను విశ్లేషించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి చట్ట పరంగా చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేకూరేలా కృషి చేయాలని సూచించారు. సాధ్యమైనంత ఎక్కువ కేసులు డిస్పోజలు చేయాలని సిఐ కి  ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో SB సి ఐ  నరసింహ రావు, SI మహేంద్ర, ఎస్పీ సి సి శ్రీనివాస్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ముళ్ల పొదల్లో… అపస్మారక స్థితిలో చేతులు కట్టేసి ఉన్న యువతి

Satyam NEWS

విద్యలనగరం కాస్త డ్రంక్ అండ్ డ్రైవ్ నగరం..

Satyam NEWS

గాంధీ నగర్ లక్ష్మీ గణపతి ఆలయానికిఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

Leave a Comment