గుంటూరు – విజయవాడ మధ్య సాయంత్రం వేళ నడుసున్న డెమూ ప్యాసింజర్ రైలు వేళలని మార్పు చేసినట్లు రైల్వే సీనియర్ డీసీఎం డీ నరేంద్ర వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. నంబరు. 77205 గుంటూరు – విజయవాడ రైలు ప్రస్తుతం సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరి 6 గంటలకు విజయవాడ చేరుకుంటోంది. డిసెంబరు 2వ తేదీ నుంచి ఈ రైలు సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.25 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ మార్పులను ప్రయాణీకులు గమనించాలని సీనియర్ డీసీఎం విజ్ఞప్తి చేశారు.
previous post