37.2 C
Hyderabad
March 28, 2024 18: 55 PM
Slider విజయనగరం

చాగంటి కోటేశ్వరరావు కు గురజాడ అవార్డు అన్యాయం

#gurajada

మహాకవి గురజాడ అప్పారావు పేరిట ఇస్తున్న “గురజాడ అప్పారావు అవార్డు’’ కులాన్ని, ఆ భావాలను ప్రవచనాలు చెప్పే చాగంటి కోటేశ్వరరావు కు ఇవ్వడం సాహితీ రంగానికే అవమానమని విజయనగరం లో అభ్యుదయ రచయతల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు గురజాడ స్వగృహం నుంచీ గురజాడ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే గంటస్థంభం నుంచీ గురజాడ విగ్రహం వరకు ఆ ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా అరసం సభ్యులు మాట్లాడుతూ ఆయన జాడ నాకు అడుగు జాడ అంటూ తెలుగు ఆధునిక సాహిత్యం లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న శ్రీ శ్రీ నే మహాకవి గురజాడ ను ఆదర్శంగా తీసుకుని ఓ విప్లవాన్ని తీసుకువచ్చారన్నారు. అలాంటి వ్యక్తులకు కాకుండా ప్రవచనాలలో కులాన్ని ప్రొత్సహిస్తున్న ఆ ప్రవచన కర్త కు గురజాడ అవార్డు ఇవ్వడం సహేతుకం కాదని అభ్యుదయ రచయతల సంఘం అభిప్రాయపడింది

Related posts

కేదార్ నాథ్ యాత్రీకుల సంక్షేమం కోసం చర్యలు

Satyam NEWS

కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యంపై సీపీఎం నిరసన

Satyam NEWS

వ్యక్తి ఆరాధనకు పరాకాష్ట: దుర్గా మాత పక్కన దీదీ విగ్రహం

Satyam NEWS

Leave a Comment