33.2 C
Hyderabad
April 26, 2024 01: 24 AM
Slider నెల్లూరు

వి యస్ యూనివర్సిటీ లో ఘనంగా గురజాడ వేంకట అప్పారావు జయంతి

#vikramsimhapuriuniversity

నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణం లోని శ్రీ పొట్టి శ్రీ రాముల భవనంలో గురజాడ వెంకట అప్పారావు జయంతి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రెక్టర్ ఆచార్య ఎం.చంద్రయ్య, రిజిస్ట్రార్ డా.ఎల్.విజయ కృష్ణారెడ్డి గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. రెక్టర్ ఆచార్య ఎం.చంద్రయ్య మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనల ద్వార, నాటకాల ద్వార సమాజంలో వున్నా దురాచారాలని ఎలుగెత్తి చాటారని అన్నారు.

ఆ దురాచారాల వల్ల ప్రజలు ఎంత నష్టం అనుభవిస్తున్నారో ఎంత బాధ పడుతున్నారో అందరికి అర్ధం అయ్యే సరళమైన భాషలో ఆయన చెప్పారని తెలిపారు. ఇప్పటికి కూడా బాల్యవివాహాలు, మాతంగి వ్యవస్థలు అక్కడక్కడ జరుగుతున్నాయని, ఇటువంటి దురాచారాల పైన పోరాడిన గురజాడ అప్పారావు మనకి ఆదర్శం కావాలని ఆయన అన్నారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో ఇటువంటి మహనీయులని జ్ఞాపకం చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం చాల మంచి విషయం అని తెలిపారు.

అదే విధంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.ఎల్.విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ మహనీయులు చెప్పిన మాటలను ఆచరించిన విధానాలను మనం అనుసరించడం భావితరాలవారికి అందించడం కోసం మనం మహనీయులను గుర్తుచేసుకుంటామని అన్నారు. గురజాడ 100 సంవత్సరాలు క్రితం చెప్పిన మాటలను ఇప్పటికి గుర్తుచేసుకోవలసిన అవసరం ఉందన్నారు.

వాటిల్లో కన్యాశుల్కం అనే నాటకం ద్వారా సామాన్య ప్రజలకు అంటే చదువు రాని పామరులకి కూడా అర్ధం అయ్యే విధంగా ఈ కన్యశుల్కం నాటకాన్ని రచించారని తెలిపారు. కన్యాశుల్కం ద్వార బాల్య వివాహాలను, ఆ రోజుల్లో వున్న సమస్యలను, సామజిక రుగ్మతులను ఆయన ప్రతిఘటించారు అని చెప్పారు. ఒక 15 సంవత్సరాలు క్రితం ప్రభుత్వం బాల్య వివాహాల మీద రఘువోత్తమ రావు ఏకసభ్య కమిషన్ నియమించిందని, నివేదికలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలను పొందుపరిచారని చెప్పారు.

ఇప్పటికీ ఊర్లలో వుండే కొంత మంది మూర్ఖులు బాల్య వివాహాలను, దేవుడి పేరు చెప్పి మాతంగులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. గురజాడ అప్పారావు లాంటి మహనీయులను మనం అప్పుడప్పుడు స్మరించుకుంటే కనీసం అటువంటి సమస్యల పైన స్పందించటానికి బాగుంటుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమములో పరీక్షల నియంత్రణ అధికారి డా.సాయి ప్రసాద్ రెడ్డి, సూపరింటెండెంట్ రామకృష్ణ, మోహిని,స్వాతి, కిరణ్మయి,స్రవంతి,సాగర్,సుధారాణి, తెలుగు శాఖ అధిపతులు డా రాజారామ్, డా లక్ష్మినారయణ, డా విమల బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్ధిని, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనాతో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి

Satyam NEWS

జనగామ సబ్ జైలు లో ఖైదీలకు కరోనా

Satyam NEWS

శార్వానంద్, రష్మిక చిత్రం షూటింగ్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment