39.2 C
Hyderabad
March 29, 2024 15: 54 PM
Slider ప్రత్యేకం

దేశమంటే మట్టికాదోయ్…దేశమంటే మనుషులోయ్..

#gurajada

మహాకవి గురజాడ చెప్పిన ఈ మాటలు…భవిష్యత్ తరాలు మరింతగా గుర్తుపెట్టుకోవాలని..విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ అన్నారు. మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా విజయనగరం లోని గురజాడ అప్పారావు రోడ్ లో ఉన్న ఆయన స్వగృహాన్ని పరిశీలించారు. అక్కడే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసారు. అక్కడ నుంచే ఆయన రచించిన గేయాలను పఠిస్తూ….గురజాడ సర్కిల్ వరకు వెళ్లారు.

అక్కడే గురజాడ విగ్రహం నికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. మహాకవి గురజాడ అభ్యుదయ భావాలు కలిగిన రచయిత ని…18 శతాబ్దంలో నే సమకాలీన సమాజ స్థితి గతులతో గేయాలు రాసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. నేటి తరానికి గురజాడ ఓ జాడ అని జేడ్పీ చైర్మన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సూర్య కుమారి..డీఆర్ఓ గణపతి రావు…ఏ.గోపాలరావు ..గురజాడ మనమడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దీపావళి నాడు టపాకాయలు కాల్చడంపై నిషేధం

Satyam NEWS

“తెలంగాణ బత్తాయి డే” బ్రోచర్ ఆవిష్కరణ

Satyam NEWS

హామీలను విస్మరిస్తే ప్రజా పోరాటాలు

Bhavani

Leave a Comment