ఆ గ్రామంలో చనిపోతే ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. స్మశానం వాడుకోవడానికి చెల్లించాల్సిన ఖర్చు ఉండదు. అదే సిద్దిపేట నియోజకవర్గంలోని గుర్రాల గొంది గ్రామం. ఊరి స్మశాన వాటికను ఉచితంగా వాడుకోవచ్చు. మరణించిన తర్వాత కూడా ఖర్చు చేయడం చాలా కుటుంబాలకు పెద్ద సమస్య. ఆ సమస్యను తీర్చే దిశగా గుర్రాల గొంది గ్రామం ఒక అడుగు వేసింది. మాజీ మంత్రి, ఆ నియోజకవర్గ ఎం ఎల్ ఏ హరీష్ రావు ఈ స్కీమ్ కు రూపకల్పన చేశారు. దానికి గుర్రాల గొంది గ్రామస్థులు మేము అమలు చేసుకుంటాం అని ముందుకు కదిలారు. గుర్రాల గొంది సర్పంచ్ అంజనేయులు సంసిద్ధత వ్యక్తం చేయడంతో హరీష్ రావు ఉచితంగా అంతిమ సంస్కారాలు నిర్వహించే రాష్ట్రంలో తొలి గ్రామంగా గుర్రాల గొంది ని ప్రకటించారు. హరిశ్ రావుతో పాటు , సర్పంచ్ పలువురు ముందు కు వచ్చి దాదాపు 8లక్షల వరకు విరాళాలు ఇచ్చి ఉచిత దహన సంస్కారానికి ఊతం ఇచ్చారు. ఈరోజు 85 సంవత్సరాల కంకణాల చంద్రవ్వ మృతి చెందగా గ్రామ సర్పంచ్ , పాలకవర్గం గ్రామ పంచాయతీ నుండే దహన సంస్కారాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అంజనేయులు స్వయంగా పాడె మోసి ఆదర్శంగా నిలిచారు.
previous post