22.7 C
Hyderabad
February 14, 2025 01: 38 AM
Slider హైదరాబాద్

ఘనంగా శ్రీ గురు గోవింద్ జయంతి

#gurugovind

సిక్కుల 358వ గురువు శ్రీ గురు గోవింద్ జయంతి వేడుకలను వేలాది మంది సిక్కు భక్తులు జరుపుకున్నారు. శాంతి, మత సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేసిన ఖల్సా పంత్ వ్యవస్థాపకుడు ప్రకాష్ పురబ్ జయంతిని సికింద్రాబాద్‌లోని గురుద్వారా సాహెబ్  ప్రబంధక్ కమిటీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా “విశాల్ దీవాన్” (సామూహిక సమ్మేళనం) నిర్వహించారు. గురుబాని కీర్తనలు, పారాయణాలు నిర్వహించినట్లు ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు ఎస్.బల్దేవ్ సింగ్ బగ్గా, ప్రధాన కార్యదర్శి ఎస్.జగ్మోహన్ సింగ్, ఉపాధ్యక్షుడు ఎస్.హర్‌ప్రీత్ సింగ్ గులాటీ తెలిపారు. ప్రసిద్ధ రాగి జాఠాలు (సిక్కు బోధకులు) కథలు (పవిత్ర స్తోత్రాలు) ప్రముఖ రాగి జాతాలు, భాయ్ సరబ్జీత్ సింగ్ (పాట్నా సాహెబ్), భాయ్ జస్కరన్ సింగ్ (పాటియాలా), గ్యానీ జగ్దేవ్ సింగ్, భాయ్ చరణ్జీత్ సింగ్, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన ప్రముఖ రాగి జాఠాలు ఈ కార్యక్రమంలో పాల్గొని గుర్బానీ కీర్తనలను పఠించారు. జాతీయ సమైక్యత, శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం కోసం నిలబడిన సిక్కు గురువుల బోధనలపై కూడా వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. గురుగోవింద్ సింగ్ దేవ్‌జీ బోధనలను భక్తులు పాటించాలని వారు కోరారు. సమ్మేళనం ముగింపు తర్వాత సాంప్రదాయ గురు-కా-లంగర్ (ఉచిత కమ్యూనిటీ కిచెన్) భక్తులందరికీ అందించారు.

Related posts

వ్యతిరేక లేబర్ కొడ్ లను తక్షణమే రద్దు చేయాలి

Satyam NEWS

Moody’s : భారత్ వృద్ధి అంచనాల తగ్గింపు

Satyam NEWS

సీఎం కేసీఆర్ మహిళల పక్షపాతి: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS

Leave a Comment