31.7 C
Hyderabad
April 24, 2024 23: 51 PM
Slider శ్రీకాకుళం

గురురాఘవేంద్ర స్వామి ఛారిటబుల్ ట్రస్ట్ సహాయం

gururaghavendra trust

అన్నార్తులను అందుకుంటూ ముందుకు సాగుతున్న గురురాఘవేంద్ర స్వామి వారి ట్రస్ట్ సేవలు మరువరానివని శ్రీకాకుళం డిఎస్పీ  డిఎస్ఆర్ వి.ఎస్. ఎన్. మూర్తి అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్లు కూడలిలో గురురాఘవేంద్ర స్వామి దేవాలయం వ్యవస్థాపకులు బరాటం కామేశ్వరరావు కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, మీడియా ప్రతినిధుల కు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఎస్పీ మాట్లాడుతూ మండుటెండలో పగలు రాత్రి లు తేడాలేకుండా లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీస్, మీడియా సేవలు సమాజం గుర్తించి ఇట్లాంటి దాతృత్వాన్ని చాటుకుంటున్నకామేశ్వరరావు అందరికీ ఆదర్శంగా నిలుస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో గురురాఘవేంద్ర ట్రస్ట్ ప్రతినిధులు కొంఖ్యాన వేణుగోపాల్, శాసపు జోగినాయుడు, పైడి నిర్మల్ కుమార్, ఎన్. అప్పారావు, రౌతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మూడు రాజధానులు: ఈ కొత్త ఐడియా జీవితాన్నే మార్చబోతున్నది

Satyam NEWS

మాలలకు ద్రోహం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ

Satyam NEWS

భవన నిర్మాణాల్లో వేగం పెంచాలి

Murali Krishna

Leave a Comment