38.2 C
Hyderabad
April 25, 2024 14: 10 PM
Slider వరంగల్

మినీ గురుకుల పాఠశాలను పున:ప్రారంభించాలి

#GurukulaSchool

మినీ గురుకులం పాఠశాల పునః ప్రారంభించాలని ట్రైబల్ మినీ గురుకులం కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ సి ఐ టి యు రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల అన్నారు. ఈ మేరకు గురువారం ములుగు మహబూబాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ రాజలక్ష్మి కి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా గా నిర్మల మాట్లాడుతూ మినీ గురుకులం లో విధులు నిర్వర్తిస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి జూన్ మాసం నుంచి వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. వేతనాలు లేక కాంట్రాక్టు ఉపాధ్యాయులు కూలీలుగా మారుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం గురుకుల ప్రభుత్వ పాఠశాలలను ఈనెల 27 నుంచి ప్రారంభించి మినీ గురుకులం మాత్రమే ప్రారంభించక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మా పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మినీ గురుకులం లో మండల పరిధిలోని గ్రామాల విద్యార్థులు మాత్రమే గురుకుల విద్యనభ్యసిస్తున్నారని అందుకు విద్యార్థుల గ్రామాలకు వెళ్లి ఉపాధ్యాయులను విద్యాబోధన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ విషయంపై స్పందించిన కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి గురుకులం సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేఖ ద్వారా తెలియపరిచి రెండు మూడు రోజుల్లో పాఠశాల పున ప్రారంభం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మానమ్మా, ఫుల్ బాయ్, లతా ,రజిని రజిత సిబ్బంది సుశీల కమల తదితరులు పాల్గొన్నారు.

Related posts

హత్యాయత్నం కేసును గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు

Bhavani

ప్రకృతి వైద్యంలో కొత్త పుంతలు తొక్కే శాంతిగిరి

Satyam NEWS

ఆంధ్రుల హక్కును రక్షించలేకపోతే వైసీపీ ఇక ఖతం

Satyam NEWS

Leave a Comment