39.2 C
Hyderabad
March 29, 2024 17: 05 PM
Slider ఖమ్మం

గురుకులాలకు శాశ్వత భవనాలను మంజూరు చేయాలి

#aisf

ఖమ్మం నగరం లో శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఆవరణంలో ఉన్న భవన సముదాయాలలో నడుస్తున్న బీసీ మైనార్టీ ఎస్టీ గురుకులాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో శారద ఎడ్యుకేషన్ సొసైటీ యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందిందని ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని సిపిఐ కార్యాలయం గిరి ప్రసాద్ భవన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి భవనాలకు అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేసుకుంటూ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ  కొరవడంతోనే ఈ పరిస్థితి కలిగిందన్నారు.

ముఖ్యంగా  ఆవరణంలో ఎస్ ఎన్ మూర్తి పాలిటెక్నిక్ కళాశాల బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ చెయ్యకపోవడం ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఆవరణంలో ఉన్న భవనాలకు  ఫైర్ సేఫ్టీ లేదన్నారు. భవనాల సముదాయాలపై చెట్లు మలుస్తూ శిథిలావస్థకు చేరుకుంటున్న పట్టించుకోవడం లేదన్నారు భవనాల కిటికీలకు అద్దాలు పగిలిపోయిన మరుమతులు చేయడం మర్చిపోయారన్నారు. ఇన్ని అసౌకర్యాలు మధ్యన కనీసం రక్షణ లేకుండా భవన సముదాయంలోని గురుకులాలను కొనసాగించడం వెనక ఆర్‌సిఓ ల ప్రమేయం ఉందన్నారు. ఆర్సిఓ లు యజమాన్యాలతో కుమ్మకై సౌకర్యాలు లేకపోయినా నెల అద్దే చేల్లింపులు  చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికపరమైన లాలూచీలకు  పాల్పడుతున్నారని, తక్షణమే జిల్లా కలెక్టర్ గురుకులాలను సందర్శించి ఆర్సిఓ ల పై చర్యలు తీసుకోవాలని ఈ గురుకులాలను తక్షణమే అన్ని సౌకర్యాలు ఉన్నా వేరే ప్రాంతానికి మార్చాలని ప్రభుత్వం అద్దె చెల్లింపులకు స్వస్తి పలికి గురుకులాలకు శాశ్వత భవనాలను మంజూరు చేయాలని వారి డిమాండ్ చేశారు అధికారులు అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలను మార్చని పక్షంలో గురుకులాల ముందు ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.

Related posts

గ్రామీణులకు ఉపాధి లేకుండా చేస్తున్న బీజేపీ

Bhavani

మట్టపల్లి దేవాలయ అభివృద్ధికి రైతులు సహకరించాలి

Satyam NEWS

అన్ని ఆలయాలకు పూర్తి భద్రత కల్పిస్తాం

Satyam NEWS

Leave a Comment