32.2 C
Hyderabad
April 20, 2024 21: 44 PM
Slider విశాఖపట్నం

అక్రమ భవనాల నిర్మాణంతో జీవీఎంసీ ఆదాయానికి గండి

పైస్థాయిలో రాజకీయ నాయకులు, అధికారులు పెద్ద పెద్ద కబ్జాలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తుంటే కింది స్థాయి అధికారులు కూడా తమ వంతుగా అవినీతికి పాల్పడుతున్నారు. దాంతో జీవీఎంసీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతున్నది. నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగినా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులకు భారీగా ముడుపులు తీసుకుని కళ్ళు మూసుకుంటూ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎంగులు మెతుకులకు ఆశపడుతూ ప్రజల ప్రాణాలతో మాట్లాడుతున్నప్పటికీ స్థానిక సచివాలయం అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీస స్పందన కరువు అవుతుంది. ప్రజల ప్రాణాలను కాపాడవలసిన ప్రజా ప్రతినిధులు ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారనే అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. విశాఖపట్నం జోన్ 5 తాటి చెట్ల పాలెం వార్డ్ 55 సాయిరాం హాస్పిటల్ సందు అక్రమ నిర్మాణాలకు అడ్డగా మారింది. జి ప్లస్ వన్ భవనానికి పర్మిషన్ తీసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులకు భారీగా ముడుపులు అందించి ఒకే డోర్ నెంబర్ తో రెండు భవనాలను కట్టేశారు.

ఈ భవనానికి స్థానిక కార్పొరేటర్ 55వ వార్డు శశికళ అండదండలు ఉన్నాయని గట్టిగా వినిపిస్తుంది. ఒకే భవనం పేరుతో ఒక డోర్ నెంబర్ తో రెండు భవనాలు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు కనీసం స్పందన లేకపోవడం దురదృష్టం.

ప్రధానంగా ఈ భవనానికి ఆనుకుని ఉన్న ఎలక్ట్రికల్ వైరు ఉన్నప్పటికీ ప్రజలకు ప్రాణానికి ఉన్నప్పటికీ కూడా అధికారులు దీనికి పై స్పందించడం లేదు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై అవినీతి నిరోధక శాఖ దాడి చేస్తున్నప్పటికీ వ్యవహారం ఏమాత్రం మారలేదు. ఈ భవనం అక్రమ నిర్మాణమని దీనితో ప్రమాదం పొంచి ఉన్నదని స్థానికులు కొంతమంది స్థానిక సచివాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్ళు మూసుకొని వీరికి అనుమతులు ఇవ్వడం గమనార్హం.

Related posts

భూములు లేని  కుటుంబాలకు భూములు ఇవ్వాలి

Satyam NEWS

మార్చి నెలలో రూ.1.42 లక్షల కోట్లు

Sub Editor 2

మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంట్లో దొరికింది ఎంతో తెలుసా?

Satyam NEWS

Leave a Comment