కర్నూలు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఓటరు జాబితాలో మహిళా ఓటరుకు బదులుగా సినీ నటుడు వెంకటేష్ చిత్రం ప్రచురితమైంది. కర్నూలు నగరంలోని 31వ వార్డులోని ఓ మహిళా ఓటరు వివరాల దగ్గర నటుడు వెంకటేశ్ చిత్రం ఉంది. ఇలాంటి తప్పులు చాలానే ఉన్నాయని ఓటర్లు ఆరోపిస్తున్నారు. తప్పుల విషయమై నగరపాలక అధికారులను వివరణ కోరగా ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఫొటో ఓటరు జాబితాలో తప్పులు దొర్లకుండా సరిచేస్తామని వెల్లడించారు.
previous post
next post