ముగ్గురు అమ్మాయిలను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డికి మరణశిక్ష విధించిన నేపథ్యంలో హాజీపూర్ లో సంబరాలు చేసుకున్నారు. గ్రామస్తులు బాధితుల కుటుంబసభ్యులతో కలిసి మిఠాయిలు పంచారు. సంతోషంతో బాణసంచా కాల్చారు.
ఊరిలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. శ్రీనివాస్ రెడ్డిని వీలైనంత త్వరగా ఉరితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాలికలను దారుణంగా కడతేర్చిన శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్షే సబబు అని హాజీపూర్ వాసులు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు